వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నిరాహార దీక్ష చేపట్టారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లాక్డౌన్లోనూ మద్యం దుకాణాలు తెరవడంతో పాటు ధరలను పెంచి పేద ప్రజలకు దోచుకుంటున్నారని విమర్శించారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కరవై... తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో విద్యుత్ ఛార్జీల ధరల పెంచారని ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలపై భారం పెంచకుండా వెంటనే విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించాలని సుగుణమ్మ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి మోదీజీ.. వడ్డీ వ్యాపారం ఆపి, సాయం చేయండి'