తిరుపతిని మరో పులివెందుల చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతామోహన్ ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రేణిగుంటలో పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. బస్టాండ్, కూరగాయల మార్కెట్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ప్రజలకు కరపత్రాలు పంచి పెట్టారు.
కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. అధికార వైకాపా తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం ద్వారా గెలుపొందడానికి ప్రయత్నస్తోందన్నారు. డబ్బు, మద్యం భారీగా పంచడానికి.. ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో నాలుగు లక్షల ఓట్ల మెజారిటీ వస్తుందని మంత్రులు ప్రకటనలు చేయటం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
ఇవీ చూడండి: