ఉత్తరప్రదేశ్లో దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా హత్య చేసిన ఘటనను కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చింతా మోహన్ ఖండించారు. తిరుపతిలోని తన నివాసంలో ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
నిందితులను అరెస్ట్ చేయడంలో విఫలమైన యూపీ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని చింతా కోరారు. కొంత కాలంగా దళితులపై దాడులు తీవ్రమయ్యాయని ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి పదవికి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: చలో మదనపల్లె: తిరుపతిలో ఉద్రిక్తత.. ఎస్సీ సంఘాల నేతల అరెస్టు