చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండల కేంద్రంలో కొవిడ్ నివారణ చర్యలు, నవరత్నాల అమలుపై సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు అమలు అవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు, ఇంటి స్థలాల పంపిణీ విషయాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లో సారా తయారీ నిర్మూలించడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలోని నివేదికల ప్రకారం తాను తనిఖీ నిర్వహించి వివరాలు సేకరిస్తారని, తప్పుడు సమాచారమని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు ప్రజలకి అందుబాటులో ఉంటూ... సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ఇదీ చదవండీ... పేదవాడికి ఉపయోగపడని ప్రభుత్వాలు.. ఫెయిల్ అయినట్లే: సీఎం