Electro Steel Casting: శ్రీకాళహస్తికి మరో భారీ పెట్టుబడి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వెయ్యి కోట్ల రూపాయలతో ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ సంస్థ విస్తరణ ప్రణాళిక పెట్టినట్లు తెలిపింది. 22 ఏళ్లుగా డక్టయిల్ ఐరన్ ప్రెషర్ పైప్స్ తయారీ రంగంలో ఉన్న ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్.. పెట్టుబడులకు ఆసక్తి కనబరచినట్లు తెలిపింది. సీఎం జగన్ తో ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ ఎండి ఉమంగ్ కేజ్రీవాల్, సీఓఓ సురేష్ ఖండేల్వాల్ సమావేశమమై.. ప్రణాళికలు సీఎం కు వివరించారు. రానున్న కాలంలో 0.5 మిలియన్ టన్నులకు ఉత్పత్తిని విస్తరించనున్నట్లు లృసంస్థ ప్రతినిధులు తెలిపారు.
డక్టయిల్ ఐరన్ ప్రెషర్ పైప్స్ తయారీ రంగంలో మేము గత ఇరవై ఏళ్లుగా ఉన్నాము. క్రమంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో.. ఏడాదికి 0.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయడానికి.. కాళహస్తిలో వెయ్యి కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టబోతున్నాం. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రితో చర్చించి, భవిష్యత్‌లో ఎలా ముందుకెళ్లాలనేదానిపై చర్చించాం.- ఉమంగ్ కేజ్రీవాల్, ఎండీ ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ లిమిటెడ్
ఇదీ చదవండి: పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్.. మరో రెండేళ్ల పాటు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు