ETV Bharat / state

చంద్రగిరిలో 'నువ్వా... నేనా'

రాష్ట్ర రాజకీయాల్లో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తయితే చిత్తూరు జిల్లాలోనీ చంద్రగిరి మరోఎత్తు. ఇక్కడ అధికార తెలుగుదేశం... ప్రతిపక్ష వైకాపా అభ్యర్థులు నువ్వా... నేనా... అన్నట్లు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి గల్లా అరుణకుమారిపై వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి 4500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఈసారి చంద్రగిరి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఇరుపార్టీలు పట్టుదలగా ఉన్నాయి.

author img

By

Published : Mar 8, 2019, 7:07 AM IST

చంద్రగిరిలో 'నువ్వా... నేనా'

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు 6 నెలల ముందే చంద్రగిరి అభ్యర్థిగా... పులివర్తి నానిని ప్రకటించాడు. వైకాపా నుంచి మళ్లీ చెవిరెడ్డినే బరిలోకి దింపడానికి జగన్ సుముఖంగా ఉన్నారు. దీంతో అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. 6 మండలాల్లో పర్యటిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నిత్యం ప్రజల్లో ఉంటూ... తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామం ఈ నియోజకవర్గంలోనే ఉండటంతో... తెదేపా పట్టుదలగా ఉంది. 1978లో తొలిసారిగా ఇక్కడి నుంచే పోటీచేసిన చంద్రబాబు... తెదేపాకు కంచుకోటగా మార్చారు. 1989... 1999... 2004... 2009... ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన గల్లా అరుణకుమారి... కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో తెదేపా నుంచి బరిలో దిగగా... భాస్కర్​రెడ్డి చేతిలోఓడిపోయారు.

ఈ ఎన్నికల్లో అరుణకుమారి స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకోవడంతో... తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని అభ్యర్థిగా ప్రకటించారు. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో... నాని ప్రచారంలో దూకుడు పెంచాడు. పులివర్తి ధాటికి... చెవిరెడ్డి కుటుంబం అంతా... నియోజకవర్గంలో పర్యటిస్తోంది. చెవిరెడ్డి సతీమణి లక్ష్మి... తనయులు మోహిత్​రెడ్డి... హర్షిత్​రెడ్డి కూడా వైకాపా తరఫున ప్రచారం చేస్తున్నారు. అప్రమత్తమైన పులివర్తి కుటుంబం ప్రచారంలోకి దిగింది.

ఇద్దరు అభ్యర్థులూ... ప్రజలతో మమేకమవుతూ... ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. నియోజకవర్గంలో తమకు అనుకూలమైన ఓటర్ల మినహా... మిగతా ఓట్లు తొలగిస్తున్నారనే ఆరోపణలతో... తెదేపా..వైకాపా అభ్యర్థులు పోలీస్​స్టేషన్లల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో చంద్రగిరిలో ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి చంద్రగిరిలో పసుపు జెండా ఎగురుతుందా... ఫ్యాను గాలి వీస్తుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.