ETV Bharat / state

ఏక్‌సాల్‌ పట్టాల రద్దు.. అధికారులకు సవాల్‌

author img

By

Published : Dec 4, 2020, 4:58 PM IST

చిత్తూరు జిల్లాలో గతంలో అధికారులు చేసిన తప్పిదం ప్రస్తుతం రెవెన్యూ శాఖకు తలనొప్పిగా మారింది. ఏక్‌సాల్‌ పట్టాలను రద్దు చేసినా వాటిని తిరిగి వెనక్కి తీసుకోకపోవడంతో పరిహారం చెల్లించాలంటూ పలువురు బాధితులు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు. అవి రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూములుగా ఉండటంతో పరిహారం చెల్లించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. సమస్య పరిష్కరించే విషయమై రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పరిస్థితి సూరప్పకశంలో నెలకొంది.

Ek Sal land pattas
అధికారులకు సవాల్‌

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం సూరప్పకశం పరిధిలో సుమారు 150 ఎకరాలను 1982 ప్రాంతంలో స్థానికంగా ఉన్న 149 మంది రైతులకు ఏక్‌సాల్‌ పట్టాలు ఇచ్చారు. అక్కడ వ్యవసాయం జరగట్లేదని పేర్కొంటూ మూడేళ్ల తర్వాత పట్టాలను రద్దు చేశారు. ఏక్‌సాల్‌ పట్టాలను రద్దు చేసే అధికారం తహసీల్దారుకు ఉండటంతో వాటిని రద్దు చేసి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. అప్పటి నుంచి రెవెన్యూ లెక్కల ప్రకారం ప్రభుత్వ భూములుగానే ఉంటూ వస్తున్నాయి. అక్కడ పరిశ్రమల స్థాపనకు 1985 ప్రాంతంలో భూమిని ఏపీఐఐసీకి అప్పగించగా.. 1987లో తమకు వద్దంటూ తిరిగి రెవెన్యూశాఖకు ఇచ్చేశారు. అనంతరం అక్కడ సింగపూర్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. దీనికి అనుగుణంగా తుడా భూములను ఎకరా రూ.లక్ష వంతున కొనుగోలు చేసింది. అప్పటి నుంచి భూమి తుడా అధీనంలోనే ఉంది. దీనిపై కొందరు తమకు పరిహారం చెల్లించాలని కోరుతూ న్యాయస్థానాన్ని, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు.

పరిహారం చెల్లించలేం:

వాస్తవానికి ఏక్‌సాల్‌ పట్టాలు అనేవి కేవలం ఒక్క సంవత్సరంలో పంటలు సాగుచేసుకునేందుకు మాత్రమేనని, అవి పూర్తిస్థాయి పట్టాలు కావని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వాటిని రద్దు చేసి రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా పొందుపర్చిన సమయంలో ఎవరూ వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేరని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల కొందరు తమకు పరిహారం చెల్లించాలని పేర్కొంటూ రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఒక్కసారి ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన తర్వాత పరిహారం చెల్లించే అవకాశం లేదు. ప్రభుత్వానికి నివేదించాలన్నా ఇప్పటి వరకు ప్రభుత్వ భూమిగా పేర్కొన్నప్పుడు కొత్తగా పరిహారం చెల్లించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు తుడా కూడా ఒక్కో ఎకరానికి రూ.లక్ష చెల్లించి కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు ఈ విషయమై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు న్యాయస్థానంలో ఇప్పటికే కౌంటరు దాఖలు చేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా వారికి స్టే లభించలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

బహిరంగ వేలం ద్వారా విక్రయం:

తుడా అధికారులు ఇక్కడి భూమిని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఉన్న 150 ఎకరాలను స్థలాల కింద మార్పు చేస్తున్నారు. ఇందులో దిగువ, మధ్య, ఎగువ తరగతి వారు కొనుగోలు చేసే విధంగా స్థలాలను వర్గీకరిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. తద్వారా తుడా ఆదాయాన్ని పెంచుకుని వాటి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వీటిని రెవెన్యూ అధికారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు లేకుండా ఉండే ఆస్కారం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: భారీ వర్షంలోనూ.. జనసేనాని పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.