విద్యాకానుక ప్రారంభ సభలో తితిదే పరిధిలోని ఏడు ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అమలవుతుందని.. జేఈవో భార్గవి అన్నారు. మూడు అన్ ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన 1600 మంది విద్యార్థులకు ఎస్వీ విద్యాదాన ట్రస్టు ద్వారా ఈ కానుక ఇప్పించేందుకు చర్యలు చేపడతామని జేఈవో ఎస్.భార్గవి తెలిపారు.
తితిదే విద్యాసంస్థల్లో వంద శాతం ఫలితాలు సాధించడంతో పాటు మధ్యలో బడి మానకుండా జగనన్న విద్యాకానుక ఎంతో దోహదపడుతుందన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక పథకాన్ని జేఈవో ప్రారంభించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు.
అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని...మనిషి బతికినంత కాలం అన్ని అవసరాలను తీర్చుతుందని అన్నారు. తితిదే విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లి పది మందికి విద్యాదానం చేయాలని ఆమె కోరారు. ఉపాధ్యాయులు మంచి ఫలితాలు సాధించేలా ప్రణాళికబద్ధంగా పాఠశాలలు నడిపించాలని జేఈఓ సూచించారు. పాఠశాల తల్లిదండ్రుల కమిటీలు చేసిన సిఫారసులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించడానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: