ప్రపంచ మానవ హక్కుల సంఘం రాయలసీమ రీజనల్ ఛైర్మన్గా చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి నియమితులయ్యారు. పెద్దతిప్ప సముద్రం మండలం కొండయ్య గారి పల్లి నివాసి ఈసు మడుగు ప్రవీణ్కుమార్రెడ్డిని నియమిస్తూ ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నియామక పత్రాన్ని దక్షిణ భారత జనరల్ సెక్రెటరీ నాగరాజు రెడ్డి అందజేశారు. ప్రవీణ్ కుమార్ తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నందుకు ప్రాధాన్యం కల్పించామన్నారు.
తనను రాయలసీమ రీజనల్ ఛైర్మన్గా నియమించిన సంఘం ఉన్నత స్థాయి ప్రముఖ వ్యక్తులందరికీ ప్రవీణ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతలు, విధులు సక్రమంగా నిర్వహించి, ప్రజలు ప్రాథమిక హక్కులు తెలుసుకునేలా అవగాహన కార్యక్రమాలను ముమ్మరంగా చేపడతానని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: దారుణం: కత్తితో ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి