చిత్తూరు జిల్లా గౌరీశంకర్ పురంలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమీపంలోని ఓ కార్మాగారం నుంచి వచ్చే బూడిదతో... తమ బతుకులు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్యాక్టరీ నుంచి వచ్చే బూడిద, కలుషిత నీరు... పంట పొలాల్లో కలిసి ఎండిపోతున్నాయని తెలిపారు. బూడిద గాలిలో, నీటిలో కలిసి అనారోగ్యానికి గురవుతున్నామని... జ్వరాల బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నామని వాపోయారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:తల్లడిల్లిన తల్లిహృదయం.. కడుపుకోతతో బీభత్సం