చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పరమేశ్వర మంగళం సమీపంలోని కేసీలో వంద పడకల కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య తెలిపారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలోని వైరస్ బాధితులకు అక్కడే వైద్య సేవలు అందిస్తున్నట్లు పుత్తూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరించారు. సెంటర్లో అవసరం మేరకు ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు అందుబాటులో ఉంచామన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ సవ్యంగా సాగుతోందన్నారు. అనుమతులేకుండా కొవిడ్ పరీక్షలు చేసే ల్యాబ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఆర్ఎంపీలు ఎట్టిపరిస్థితుల్లోనూ వైద్యం చేయరాదని.. ఆ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు.
జిల్లాలో ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాలేదని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చిందని.. తిరుపతి రుయాలో వైద్యం అందజేస్తామన్నారు. ప్రజలు మాస్కుసు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని సూచించారు. సమావేశంలో చిత్తూరు డివిజన్ వైద్యాధికారి డా. రవి రాజు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.. బ్లాక్ ఫంగస్‌ను... ఎలా గుర్తించాలి? ఎలాంటి చికిత్స కావాలి?