రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధన కఠినంగా అమలవుతోంది. ఫలితంగా ఉపాధి కోల్పోయిన పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలు గమనించి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో సహాయం చేసేందుకు కొందరు దాతలు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ - చిత్తూరు జిల్లా వార్తలు
లాక్డౌన్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పలువురు దాతలు నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. తంబళ్లపల్లె మండలం జుంజురపెంటలో పేదలకు బురుజుపల్లికి చెందిన వైకాపా నాయకులు బియ్యం, కూరగాయలు అందజేశారు.
పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ