కరోనా నియంత్రణకు ప్రభుత్వ ఆస్పత్రులకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య పరికరాలను పంపిణీ చేశారు. పుత్తూరు ఆసుపత్రికి డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేయగా.. గొల్లపల్లి, పరమేశ్వరమంగళం ప్రభుత్వ ఆస్పత్రులకు ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి వైద్య పరికరాలను అందజేశారు. ఆక్సిమీటర్లు, ఫేస్ షీల్డులు, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు తదితర సామగ్రిని అందజేశారు.. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకలు, వైద్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. 'అంబులెన్సులు అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్టు చెప్పినా...వినట్లేదు'