పలమనేరులోని 4వ వార్డులో వైకాపా అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించటంతో వాగ్వాదం జరిగింది. లోపలికి వెళ్లాలని యత్నించిన వైకాపా అభ్యర్థిని.. తెదేపా అభ్యర్థి అడ్డుకున్నారు. అయినా వినకుండా లోపలికి వెళ్తుండటంతో.. తెదేపా అభ్యర్థి కూడా ముందుకు కదిలారు. దీంతో వైకాపా కార్యకర్తలు.. పెద్ద ఎత్తున చేరుకుని తెదేపా అభ్యర్థి ని నిలువరించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. రెండు వర్గాలకు సర్ది చెప్పిన పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి.. వైకాపా నాయకులు చేస్తున్న దౌర్జన్యం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండీ.. 'తెదేపా అభ్యర్థిని కులం పేరుతో దూషించిన ఎస్సైపై చర్యలు తీసుకోండి'