చిత్తూరు నగరపాలక పరిధిలోని 21వ డివిజన్ వార్డు సచివాలయ కార్యదర్శులు జ్యోతీస్వర్, సతీష్‌పై వైకాపా వార్డు ఇంఛార్జ్ జయ ప్రకాష్‌రెడ్డి చేసిన దాడిని ఖండిస్తూ నగరపాలక కార్యాలయం ఎదుట వార్డు సచివాలయాల కార్యదర్శులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు వార్డు కార్యదర్శులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు కార్యదర్శులపై వైకాపా నాయకుడు దాడి చేయడం అమానుషమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం నగరపాలక కమిషనర్ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు.
వార్డు సచివాలయ కార్యదర్శుల ధర్నా - Dharna of the Secretaries of the Ward Secretariat
వార్డు సచివాలయ కార్యదర్శులపై దాడికి నిరసనగా చిత్తూరు నగరపాలక కార్యాలయం ఎదుట వార్డు సచివాలయాల కార్యదర్శులు ధర్నా చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు నగరపాలక పరిధిలోని 21వ డివిజన్ వార్డు సచివాలయ కార్యదర్శులు జ్యోతీస్వర్, సతీష్‌పై వైకాపా వార్డు ఇంఛార్జ్ జయ ప్రకాష్‌రెడ్డి చేసిన దాడిని ఖండిస్తూ నగరపాలక కార్యాలయం ఎదుట వార్డు సచివాలయాల కార్యదర్శులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు వార్డు కార్యదర్శులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు కార్యదర్శులపై వైకాపా నాయకుడు దాడి చేయడం అమానుషమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం నగరపాలక కమిషనర్ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి:శ్రీవారి సేవలో కర్ణాటక మంత్రి అశోక్