తిరుమల నాద నీరాజన వేదికపై తలపెట్టిన పవిత్ర ధనుర్మాస పూజా కార్యక్రమాలు ముగిశాయి. డిసెంబరు 15నుంచి మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం, జనవరి 10 నుంచి శ్రీ విష్ణు బిల్వాపత్రార్చన నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడిని, అనంత పద్మనాభ స్వామివారి విగ్రహన్ని వసంత మండపంలో ఏర్పాటు చేశారు.
సాధారణంగా శివునికి నిర్వహించే బిల్వాపత్రాల పూజను ధనుర్మాసం సందర్భంగా.. శ్రీ మహా విష్ణువుకు జరిపారు. నాద నీరాజన వేదికపై శ్రీ మహా విష్ణువు కథలైన భాగవతం, విష్ణు పురాణం ప్రవచనాలు చేపట్టారు.
ఇదీ చదవండి:
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు.. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు