తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయంలోని ప్రత్యేక కౌంటర్ ద్వారా చిత్తూరు జిల్లా వాసులకు ఈనెల 8 నుంచి శ్రీవారి సర్వదర్శన టికెట్లు జారీ చేస్తున్నారు. రోజుకు 2 వేల టికెట్లు ఇస్తున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన భక్తులు టికెట్ల కోసం ముందు రోజు రాత్రే తిరుపతికి చేరుకుంటున్నారు. నెలల పసికందులు, చిన్నారులతో వచ్చిన భక్తులు వసతి సముదాయం గేటు పక్కనే ఉన్న క్యూలైన్లో పడిగాపులు కాస్తున్నారు.
అర్ధరాత్రి వేళ దోమల బెడద, అక్కడే ఉన్న మురుగు కాలువ నుంచి వెలువడుతున్న దుర్గంధంతో అవస్థలు పడుతున్నారు. ఇలా ముందు వచ్చే వారి కోసం ఒక్కపూటైనా శ్రీనివాసంలో హాలు కేటాయించి వసతి కల్పిస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: మత్తులో చిన్నారులను చిదిమేస్తున్న ఉన్మాదులు.. తెలంగాణలో పెరుగుతున్న పోక్సో కేసులు