తిరుమల శ్రీవారి భక్తులను తితిదే సిబ్బంది ముప్పుతిప్పలు పెడుతున్నారు. స్వామి దర్శనం ముగించుకొని లడ్డుల కోసం వెళ్లిన భక్తులకు సరైన సమాధానం ఇవ్వటం లేదు. లడ్డులు కావాలని కోరితే దర్శనం ముగించిన తర్వాత తీసుకోవాలని.. లేకపోతే ఇచ్చేది లేదని సమాధానం ఇస్తున్నారు. తాము నిబంధనల మేరకే లడ్డూ కేంద్రానికి వచ్చామని తెలిపినా.. సిబ్బంది భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. లడ్డూ టోకెన్లు స్కానింగ్ అవడంలేదని అనేక మంది భక్తులను తిప్పి పంపిస్తున్నారు. ఇలా... ప్రసాదాలు అందక రోజుకు వందలాది మంది భక్తులు వెనుతిరుగుతున్నారు. తితిదే ముద్రించిన టోకన్లపై దర్శనం ముగిసిన 24 గంటల్లో లడ్డూలు పొందాలని నిబంధనలు ఉన్నా .. సిబ్బంది మాత్రం అందుకు భిన్నంగా సమాధానం ఇస్తున్నారని భక్తులు వాపోతున్నారు.
ఇది కూడా చదవండి