తెదేపా అధినేత చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆక్షేపించారు. పంచాయతీల్లో ఎలాంటి రాజకీయ వైషమ్యాలు ఉండకూడదనే ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తోందన్నారు. అందుకోసమే ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు 5 నుంచి 20 లక్షల వరకు నజరానా ప్రకటించామన్నారు. ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేయటం ఇకనైనా మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు.
ఇదీచదవండి: ఆ సభలే.. పల్లెలకు కీలకం