పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే మొదటి ఏడాది దాదాపు 12 వందల దుకాణాలు రద్దు చేశామన్నారు. ఈ ఏడాది మరో వెయ్యి మద్యం షాపులు రద్దు చేసేందుకు ఇప్పటికే జీవో జారీ చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా మద్యం దుకాణాలు తెరచి ధరలు పెంచిన రోజు నుంచి చూస్తే 20 నుంచి 30 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపారు. ప్రతిపక్షనేత చంద్రబాబు సంపూర్ణ మద్యపాన నిషేధానికి అనుకూలమా.. ప్రతికూలమా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: దిల్లీ ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్