ఇళ్లస్థలాలు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. ములకలచెరువులో నిర్వహించిన 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాలు', పక్కా గృహాలు పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో 30 వేల మందికి ఇంటి పట్టాలు అందజేసిన ఘనత రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోతుందని పేర్కొన్నారు.
నియోజికవర్గంలో అభివృద్ధి పనులు
నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు తాగు, సాగునీటి కోసం హంద్రీ నీవా కాలువ ద్వారా కృష్ణా జలాల తరలింపు కోసం ఆరు టీఎంసీల సామర్ధ్యంతో జలాశయాల నిర్మాణం చేపట్టారన్నారు. చంద్రబాబుకు కుయుక్తులు జగన్మోహన్రెడ్డి వద్ద పనిచేయవని.. రాష్ట్రాన్ని కుల, మతాలకు అతీతంగా ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పుత్తూరులో షాదీ మహల్ నిర్మాణానికి ఎమ్మెల్యే రోజా భూమి పూజ