చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలో ఈనెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈమేరకు ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలతో పాటు.. సభా ప్రాంగణం ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి...