ETV Bharat / state

'ప్రాణం పోయినా సరే చిత్తూరులో ప్రజాస్వామ్యాన్ని కాపాడతా' - tdp president chandrababu latest News

తిరుపతిలో తెదేపా అధినేత చంద్రబాబు... లోక్​సభ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన ప్రాణం పోయినా సరే చిత్తూరు జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని శపథం చేశారు. తిరుపతికి సంపద రావాలంటే.. ఆలయ పవిత్రత కాపాడాలంటే... పనబాక లక్ష్మి తప్పక గెలిచి తీరాలన్నారు.

'ప్రాణం పోయినా సరే చిత్తూరులో ప్రజాస్వామ్యాన్ని కాపాడతా'

author img

By

Published : Apr 8, 2021, 8:37 PM IST

Updated : Apr 8, 2021, 9:12 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై సీఎం నోరు మెదపడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ ఎందుకు‌ పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో రాయలసీమకు నిధులు ఇవ్వాలని ఉంటే ఈ సీఎం అది కూడా అడగటం మార్చిపోయారని ఎద్దేవా చేశారు.

'ప్రాణం పోయినా సరే చిత్తూరులో ప్రజాస్వామ్యాన్ని కాపాడతా'

'బీసీలకు అన్యాయమే చేశారు'

సామాజిక న్యాయం అంటారు కానీ బీసీలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పెట్టుబడుల కోసం తాను ప్రపంచమంతా తిరిగానని పునరుద్ఘాటించారు. జగన్ అప్పుల కోసం తిరుగుతున్నాడని.. ఇప్పుడు అప్పులు ఇచ్చేవాడు కూడా లేడని పేర్కొన్నారు. ఈ నెల ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు లేవని.. రెండేళ్లు గడచినా పీఆర్సీ రాలేదన్నారు.
ఒక్క వారం రోజుల్లోనే సీపీఎస్ చేస్తానన్నాడు.. అలా ఇప్పటికీ ఎన్ని వారాలు గడిచాయి అని ప్రశ్నించారు.

'మోసం చేయడంలో దిట్ట'

ప్రజలను మోసం చేయటంలో సీఎం జగన్ దిట్ట అని.. అందుకే తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ప్రజలను చంద్రబాబు కోరారు. అన్నింటిలో దోపిడీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "రెండేళ్లు గడచింది.. మీ బాబాయిని హత్య చేసిందెవరో ప్రజలకు చెప్పరా" అంటూ నిలదీశారు. "మా నాన్నకు న్యాయం చేయాలని చెల్లెలు అడుగుతున్నారు.. అయినా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోరు" అని ఎద్దేవా చేశారు.

'పనబాక గెలిస్తేనే...'

తాను అధికారంలో ఉన్నప్పుడు.. ఒక్కసారి తలచుకుంటే ఆనాడు వైఎస్ జగన్ పుంగనూరు దాటేవారా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుత తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మి గెలిస్తేనే జగన్ కళ్లు.. కిందకు దిగుతాయని చెప్పారు.

'ప్రాణం పోయినా సరే'

తన ప్రాణం పోయినా సరే చిత్తూరు జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని శపథం చేశారు. తిరుపతికి సంపద రావాలంటే.. ఆలయ పవిత్రత కాపాడాలంటే పనబాక లక్ష్మి తప్పక గెలిచి తీరాలని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

షాపింగ్ కాంప్లెక్స్​ జీఓ సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు

Last Updated : Apr 8, 2021, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.