చిత్తూరు జిల్లా రేణిగుంట గురవరాజు పల్లి పంచాయతీలో విద్యుత్ సమస్యలతో గ్రామస్థులు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న లాభం లేకుండా పోయింది. అందుకు నిదర్శనమే మొన్న ట్రాక్టర్ గడ్డి కాలి బూడిదైంది. ఇప్పుడు మూగజీవి ఆవు బలైంది. విద్యుత్, పంచాయతీ అధికారులకు ఎన్ని సార్లు సమస్య చెప్పిన ఎవరు స్పందించటంలేదని గ్రామస్థులు వాపోతున్నారు. పిల్లలు ఎవరైన అటువైపుగా వెళ్తే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందిస్తారా లేక మనుషుల ప్రాణాలు పోయేంత వరకు పట్టించుకోరా అంటూ గ్రామస్థులు మండిపడుతున్నారు. ఒక పంచయాతీలోనే ఇన్ని సమస్యలు ఉంటే మండలం మొత్తం మీదా ఇంకా ఎన్ని ఉంటాయో అని చర్చించుకుంటున్నారు. జరిగిన సంఘటన అధికారులకు తెలియజేస్తామంటే ఒక్కరూ ఫోన్ ఎత్తటం లేదని అన్నారు.
'విద్యుదాఘాతంతో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా' - గురవరాజుపల్లీ
రేణిగుంట గురవరాజుపల్లీ పంచాయతీలో విద్యుత్ సమస్యలపై గ్రామస్థులు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న లాభం లేకుండా పోతోంది. మొన్న ట్రాక్టర్ గడ్డి కాలి బూడిదైంయింది. ఇప్పుడు మూగ జీవి బలైంది. ఇంకెన్ని ప్రాణాలు బలైతే గానీ అధికారుల తీరు మారుతుందో అని గ్రామస్థులు వాపోతున్నారు.