చిత్తూరు జిల్లా రైతులను ఇన్నాళ్లు కరువు వేధిస్తే.. నేడు ముసురు వానలు ముంచుతున్నాయి. ఖరీఫ్‌లో విత్తిన వేరుశనగ సాగు మొదలైనప్పటి నుంచి నూర్పిడి చేసే వరకు అధిక వర్షాలు నిలువునా ముంచేశాయి. పంట కుళ్లిపోయి దిగుబడులు రాకపోగా.., చివరికి పశుగ్రాసంగా కూడా పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం వరి పరిస్థితి ఇలాగే ఉంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని వ్యవసాయ డివిజన్ పరిధిలో 1,057 హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు.
కరోనా ప్రభావంతో స్వగ్రామాలకు చేరుకున్న రైతులు అష్టకష్టాలు పడి అప్పులు చేసి వేరుశనగ, వరి, ఇతర పంటలు సాగు చేశారు. కాగా...పెట్టుబడులు కూడా రాని విధంగా ఈసారి ముసురు వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి. గాలి, ముసురు వానలకు కోత దశలోని వరి నేల వాలిపోయింది. నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: