చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బీ.కొత్తకోట రెవెన్యూ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని సీపీఐ నియోజకవర్గం నాయకుడు మనోహర్‌రెడ్డి ఆరోపించారు. జాబితాలో చాలా మంది నిరుపేదలు అర్హులైనప్పటికీ వారికి చోటు దక్కలేదని పేర్కొన్నారు. మరోసారి అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది పరిశీలించి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు దక్కేలా జాబితా సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: మరింత మందికి శ్రీవారి దర్శనం.. మరో 3 వేల టిక్కెట్లు పెంపు