ETV Bharat / state

'ఎన్నికల కమిషనర్‌ రాసిన లేఖలో అన్ని వాస్తవాలే ఉన్నాయి'

ముఖ్యమంత్రి జగన్​పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. కులాన్ని ఆపాదించి ఎన్నికల అధికారి రమేష్‌కుమార్​పై విమర్శలు చేయటం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఎన్నికల కమిషనర్‌ రాసిన ఉత్తరంలో అన్ని వాస్తవాలే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

cpi narayana fires on cm jagan
ముఖ్యమంత్రిపై మండిపడ్డ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
author img

By

Published : Mar 20, 2020, 4:52 PM IST

ముఖ్యమంత్రిపై మండిపడ్డ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అత్యంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు తుంగలోతొక్కారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై కేంద్రానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాసిన లేఖలో అన్ని వాస్తవాలే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌కు ప్రాణహాని ఉందన్నారు.

ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి...

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలైతే ఇంటిదారి పట్టాలంటూ జగన్ చేసిన ప్రకటనలతో మంత్రులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని నారాయణ ఆరోపించారు. తెదేపా ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కు కులాన్ని ఆపాదించి విమర్శలు చేయడం దారుణమని... కులం ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను సీఎం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: 'ఎస్‌ఈసీ లేఖ.. వైకాపా నేతలకు పూర్తిగా అర్థంకాలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.