చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం రంగసముద్రంలో లక్ష్మమ్మకు చెందిన పాడి ఆవు 50 అడుగుల లోతు గల వ్యవసాయ బావిలో పడిపోయింది. సమాచారాన్ని గ్రామస్తులు ములకలచెరువు అగ్ని మాపక అధికారులకు చేరవేశారు.
అగ్ని మాపక అధికారి గుణ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది.. గ్రామ ప్రజల సహకారంతో తాళ్లు, నిచ్చెనలు ఉపయోగించి పాడి అవును సురక్షితంగా బయటకు తీశారు.
ఇదీ చదవండి:
ప్రతి రైతుకు నీటి సౌకర్యం ఉండేలా ప్రాజెక్టులు: నారాయణ స్వామి