మొన్న కేరళలో జరిగిన ఏనుగు ఘటన, నిన్న తెలంగాణలో జరిగిన కోతికి ఉరి వార్త మరవకముందే... మూగజీవాల విషయంలో చిత్తూరు జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. పెద్దపంజాణి మండలం కోగిలేరు సమీపంలో సాకార్డ్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న శ్రీకృష్ణ గోమాత పీఠంలో ఆశ్రయం పొందుతున్న ఓ గోమాత.. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లింది.
అక్కడ వన్య ప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు ఏర్పాటు చేసిన నాటు బాంబును కొరకిన కారణంగా.. అది పేలి ఆ గోమాత నోరంతా ఛిద్రమైంది. గుర్తించిన స్థానికులు, ఆలయ సిబ్బంది చికిత్స నిమిత్తం గోవును తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి తరలించారు. ఆ పరిస్థితిలో వైద్యం చేయలేమని వైద్యులు కూడా చేతులెత్తేశారు. చివరికి ఆ యజమాని.. అదే పరిస్థితిలో ఆవును తీసుకెళ్లిపోయాడు. తీవ్రంగా దెబ్బతిన్న ఆవు ముఖాన్ని చూసిన వారంతా.. ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: