ETV Bharat / state

విరాళాలు లేకుండా... గోసంరక్షణే ధ్యేయంగా..! - చిత్తూరు జిల్లా

గోవుల సంరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో గోశాలను ఏర్పాటు చేశాడు హైదరాబాద్​కు చెందిన సంఘ సేవకుడు. విరాళాలు ఆశించకుండా తన కష్టార్జితంతో సంపాదించిన సొమ్మును.. గోవుల బాగోగులకు వినియోగిస్తున్నాడు.

విరాళాలు లేకుండా...గోసంరక్షణే ధ్యేయంగా..!
author img

By

Published : May 8, 2019, 11:03 AM IST

విరాళాలు లేకుండా...గోసంరక్షణే ధ్యేయంగా..!

కరవులో రైతన్నలకు భారంగా మారిన స్వదేశీ జాతి రకం పశువులను సంరక్షించేందుకు.. హైదరాబాద్​కు చెందిన ఓ సంఘసేవకుడు ప్రశంసనీయమైన కృషి చేస్తున్నాడు. సంపాదనలో కొంత భాగాన్ని గోవుల సంరక్షణ కోసం ఖర్చు చేస్తూ రైతన్నలకు ఉపశమనం కలిగిస్తున్నారు.

స్వేచ్ఛగా జీవిస్తున్న 200పైగా గోవులు...

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం కన్య మడుగు సమీపంలోని శ్రీ కనకాలమ్మ పుణ్యక్షేత్రం వద్ద హైదరాబాద్​కు చెందిన సంఘ సేవకుడు, విద్యావేత్త దాత జయరామన్ రెండు సంవత్సరాల క్రితం గోశాలను ప్రారంభించారు. ఇక్కడ 200కి పైగా ఆవులు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. వీటికి అవసరమైన షెడ్లు, గ్రాసం, తాగునీరు, వైద్య సదుపాయాన్ని అందుబాటులో ఉంచారు.

గో సంరక్షణ, పునరుత్పత్తే లక్ష్యం....

కరవు ప్రభావంతో పడమటి మండలాల్లో తీవ్రమైన పశుగ్రాసం కొరతను పశువులు ఎదుర్కొంటున్నాయి. వ్యాధులు ప్రబలి అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నాయి. దేశంలోని వివిధ జాతుల స్వదేశీ రకం పశువుల సంరక్షణ, పునరుత్పత్తే లక్ష్యంగా గోశాల నిర్వహణ చేపట్టామని నిర్వాహకుడు జయరామన్ తెలిపారు.

గోమలంతో ఎరువులు, మందులు...

గో మూత్రం తో సేంద్రియ ఎరువులు, క్రిమిసంహారక మందులు తయారు చేస్తూ.. విష ప్రభావం లేని నాణ్యమైన దిగుబడులను 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సాధిస్తున్నారు.ఈ విధానాన్ని పడమటి మండలాల రైతులకు తెలియజేస్తూ ఆచరించేలా చూస్తున్నారు. శ్రీ కనకాలమ్మ అమ్మవారి పుణ్యస్థలాన్ని సైతం అన్ని విధాలా అభివృద్ధి చేసేలా జయరామన్ కృషి చేస్తున్నారు.

అభినందనీయం...

గోసంరక్షణశాల వలన తమకు ఎంతో ఊరట కలిగిందని ఇక్కడ పనులు నిర్వహిస్తున్న కూలీలు, ఈ ప్రాంత రైతులు పేర్కొంటున్నారు. మూగ జీవాలను ఆదుకోవాలన్న ఆయన సంకల్పం అభినందనీయమని కొనియాడుతున్నారు.

Intro:కరవు రైతుపై కన్నీటి పోటు కొనసాగుతోంది. చెట్టు మీద కాయలు ధనవర్షాన్ని కురిపిస్తామంటుంటే పాతాళ గంగమ్మ నేను పైకి రానంటోంది. దీంతో కళ్లెదుటే కనిపిస్తున్న ఆదాయం మండే ఎండలో ఆవిరయ్యే అవకాశాలు నెలకొన్నాయి. ఆదాయాన్ని దక్కించే కరువు పోటు నుంచి బయటపడడానికి అన్నదాతలు చేస్తున్న ప్రయత్నం కన్నీటి వేదనగా మిగులుతోంది. ఒక రెండు, మూడు తడులు బాగా అందించినా మంచి దిగుబడి వచ్చే సమయంలో అద: పాతాలానికి పడిపోయిన భూగర్భ జలం పైకి రాకుండా ఉంది. ఈ తరుణంలో కళ్లెదుట పంటను రైతులు నీటిని కొని దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం కరవు చరిత్ర మరో నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఏడాది చీనీ పంటకు మార్కెట్ ధరలు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో పంట దిగుబడి మెరుగ్గా వచ్చే సమయంలో బోర్లు ఎండిపోవడంతో ఉద్యాన రైతులు అయోమయంలో పడిన పరిస్థితి అనంతపురం జిల్లా పుట్లూరు మండలం లో కనిపిస్తోంది.. ఉద్యాన పంటల సాగు రైతన్నల క 'న్నీటి' కష్టాలపై ఈటీవీ ప్రత్యేక కథనం..

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని రైతులు 10 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలైన చీనీ, నిమ్మ, దానిమ్మ పంటలను సాగు చేస్తున్నారు. మండలంలోని కోమటి కుంట్ల, పి.చింతరపల్లి, పుట్లూరు, కందికాపుల, ఎస్.గూడూరు వెంగన్నపల్లి, బాలాపురం, తదితర గ్రామాల్లో లో భూగర్భ జలాలు అడుగంటడంతో 170 మంది రైతులు సాగుచేస్తున్న 250 హెక్టార్ల ఉద్యాన తోటలోని భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావులు నిరుపయోగంగా మారాయి. దీంతో రైతు తన తోటలో దాదాపు 5 బోరుబావులకు పైగా తవ్వించుకున్నా ఫలితం లేదు. దీంతో తాడిపత్రి మండలం కొనగుంటపల్లి, పుట్లూరు మండలం నారాయణపల్లి, తక్కల్లపల్లి, యల్లనూరు మండలం చిలమకూరు గ్రామ సమీపంలోని చిత్రావతి నది, తదితర ప్రాంతాల నుంచి ట్రాక్టర్ ట్యాంకు రూ.600, లారీ ట్యాంకు రూ.3000 వెచ్చించి సాగునీటిని కొనుగోలు చేస్తూ పంటను బతికించుకునేందుకు విఫల యత్నం చేస్తున్నారు. అయినా కూడా పంటలు దక్కే అవకాశం చాలా తక్కువ అని రైతులు ఆవేదన చెందుతున్నారు.

*నీటి లభ్యత లేని ఉద్యాన పంటలు : 250 హెక్టార్లు
* నీటి లభ్యత లేకపోయినా ఉద్యాన పంటల పై ఆధారపడిన రైతుల సంఖ్య: 170 మంది
* బోరుబావుల సంఖ్య: 850
* నీటి లభ్యత ఉన్న బోర్ల సంఖ్య: 0
* ఈ లభ్యత లేకపోవడంతో బోర్ల రూపంలో పడిన భారం: రూ.8.50 కోట్లు
* పంటను కాపాడుకునేందుకు రైతులు నీటిని కొనడానికి ఒక రోజుకు వెచ్చిస్తున్న మొత్తం: రూ.5.10 లక్షలు
* నీటి కొనుగోలుకు నెలకు అయ్యే ఖర్చు: రూ.1.53 కోట్లు
* గత నాలుగు నెలలుగా నీటి కొనుగోలుకు ఖర్చు: రూ.6.12 కోట్లు
* బోరు బావులు తవ్వడానికి నీటి కొనుగోలుకు ఆయన మొత్తం ఖర్చు: రూ.14.62 కోట్లు
* ప్రస్తుతం హెక్టారుకు వచ్చే దిగుబడి: 2 టన్నులు
* మొత్తం దిగుబడి: 500 టన్నులు
* ప్రస్తుత మార్కెట్ ధర (టన్నుకు): రూ.30 వేలు నుంచి రూ.35 వేలు
* ప్రస్తుతం పంటను అమ్మితే వచ్చే మొత్తం: రూ.1.75 కోట్లు.

ఇప్పటివరకు చీని రైతులు గత 10, 12 సంవత్సరాలుగా పంటలో వచ్చిన ఆదాయాన్ని మొత్తం బోరుబావుల తవ్వకం, నీటి కొనుగోలుకు వెచ్చించామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి కొనుగోలుకు అయ్యే ఖర్చు చెల్లించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు..

Body:ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.