రాయలసీమలోనే.. అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన.. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర.. వరుసగా రెండో ఏడాదీ ఏకాంతంగా జరగనుంది. తొమ్మిది రోజుల పాటు కనువిందు చేసే ఈ జాతరను కరోనా మహమ్మారి కారణంగా భక్తులు లేకుండా నిర్వహించాలని.. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి తోబుట్టువుగా.. తాతయ్య గుంట గంగమ్మ పూజలందుకుంటుంది. జాతరకు భక్తులు తరలివస్తే... కొవిడ్ నిబంధనలు పాటించటం కష్టం అయ్యే అవకాశం ఉండటం... తిరుపతిలో ఉద్ధృతమవుతున్న కరోనా దృష్ట్యా.... ఈ ఏడాదీ ఏకాంత ఉత్సవాలు జరపాలనే నిర్ణయాన్ని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. తొమ్మిది రోజులు పాటు అమ్మవారికి జాతర సమయంలో నిర్వహించే ప్రత్యేక పూజలు, అలంకరణలను యధావిథిగా కొనసాగించనున్నారు. పాలకమండలి నిర్ణయాన్ని గౌరవించి... భక్తులు సహకరించాలని... తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కోరారు.
ఇవీ చదవండి