ETV Bharat / state

covid center: చంద్రగిరిలో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం - chandragiri mla chevireddy bhasker reddy

చంద్రగిరిలో కొవిడ్ కేర్ సెంటర్(covid care center)​ను స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలోని కరోనా రోగుల ఆరోగ్యం దృష్ట్యా ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

covid care center launched in chandragiri
చంద్రగిరిలో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం
author img

By

Published : Jun 3, 2021, 8:30 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న కొవిడ్ కేర్ సెంటర్(covid care center)తో పాటు.. స్థానిక ఏరియా ఆస్పత్రిలో వంద పడకల సామర్థ్యం కలిగిన కొవిడ్ కేర్ సెంటర్​ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి(chevireddy bhasker reddy) ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా.. ఆక్సిజన్ సౌకర్యంతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేంద్రంలో అడ్మిట్ అయిన బాధితులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన చికిత్స, ఆహారం అందిస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ సాధ్యమైనంతవరకు సహాయ సహకారాలను అందిస్తానని ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి భరోసా ఇచ్చారు.

ఇదీచదవండి.

Online Food: రెస్టారెంట్‌లో ఓ ధర.. ఆన్‌లైన్‌లో మరోలా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.