చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండల కేంద్రంలో ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకగా.. వారు గ్రామం నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. గ్రామ సమీపంలోని చింత వనంలో దాగి ఉన్నారని సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది... అక్కడికి చేరుకుని 108 వాహనంలో వారిని ఆస్పత్రికి తరలించారు.
పెద్దతిప్ప సముద్రంలోకి బయటి నుంచి వచ్చిన మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులకు స్వాబ్ పరీక్షలో పాజిటివ్ అని ఫలితం వచ్చింది. వారి కోసం అధికారులు, వైద్య సిబ్బంది అన్వేషిస్తున్నట్లు సమాచారం. మొదటిసారి పెద్దతిప్పసముద్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై.. రెడ్ జోన్ గా ప్రకటించి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: