ETV Bharat / state

వైరస్ గొలుసు తెంచేదెలా.. అధికారుల కసరత్తు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా కేసుల వ్యాప్తికి మూలాలు కనిపెట్టి.. గొలుసుకట్టును తెంచడంపై అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. విధుల్లో ఉన్న రెవెన్యూ, పురపాలక, పోలీసు శాఖల ఉద్యోగులకు ఎలా సోకిందో అంతు తేల్చేపనిలో పడ్డారు.

corona positive cases in srikalahasti chittore district
శ్రీకాళహస్తిలో కరోనా కేసులు
author img

By

Published : Apr 23, 2020, 6:32 PM IST

శ్రీకాళహస్తిలో మార్చి 25న లండన్‌ నుంచి వచ్చిన ఓ యువకుడిలో తొలి పాజిటివ్‌ కేసు తేలింది. చిత్తూరు జిల్లాలో ఇదే తొలి కరోనా కేసు. ఆ యువకుని ప్రైమరీ కాంటాక్టులందరినీ క్వారంటైన్‌కు తరలించి పరీక్షించగా.. అందరికీ నెగెటివ్‌ వచ్చినందున డిశ్చార్జ్‌ చేశారు. అయితే సెకండరీ కాంటాక్టులైన నలుగురికి 30 రోజుల తరువాత కరోనా ఉన్నట్లు గుర్తించారు. ప్రైమరీ కాంటాక్టులకు రాకుండా సెకండరీ కాంటాక్టులకు పాజిటివ్‌ రావడంపై వైద్యులు విశ్లేషిస్తున్నారు.

వెళ్లిన వారికి నెగెటివ్.. కుటుంబసభ్యులకు పాజిటివ్

దిల్లీకి వెళ్లి వచ్చిన ఓ కుటుంబ యజమానికి కరోనా నెగెటివ్‌గా నిర్ధరణ అయింది. వారం తర్వాత అతని భార్య, కుమార్తెకు పాజిటివ్‌గా తేలింది. వెళ్లిన వ్యక్తికి పాజిటివ్‌ రాకుండా కుటుంబీకులకు రావడానికి గల కారణాలు అంతుపట్టడం లేదు. ఇప్పటికీ దిల్లీకి వెళ్లిన పలువురు క్వారంటైన్‌లో ఉన్నారు. రోజువారీ పరీక్షల్లో వాళ్లల్లో చాలామందికి నెగిటివ్‌ రావడం, వాళ్ల సంబంధీకుల్లో పాజిటివ్‌ రావడం గమనార్హం.

ఉద్యోగులకు ఎలా సోకింది?

లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న 11 మందికి ఏప్రిల్‌ 19నాటి ఫలితాల్లో వైరస్‌ సోకినట్లు తేలింది. నేడు విడుదల చేయనున్న బులిటెన్‌లో పోలీసు ఉద్యోగులకు ఎలాంటి ఫలితం వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. వీళ్లంతా రెడ్‌జోన్‌లో పనిచేస్తూ, అనుమానితులను క్వారంటైన్‌ కేంద్రాలకు పంపడం, వారి అవసరాలు తీర్చడంలో నిమగ్నమయ్యారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వైరస్‌ ఎలా వ్యాపించింది? అన్నది ప్రశ్నార్థకమే. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసే విధంగా దాదాపు 70 మంది ప్రత్యేక బలగాలకు ప్రధాన కూడళ్లల్లో పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.

సహకరిస్తేనే కట్టడి: పృథీ ఫఫ్వతేజ్‌

పట్టణ ప్రజలందరూ సహకారం అందిస్తే తప్ప కరోనా కేసులు కట్టడి కావని పురపాలక సంఘ ప్రత్యేకాధికారి పృథ్వీతేజ్‌ అన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను దాటి పరిస్థితి సామాజిక కాంటాక్టుల దాకా సాగుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇల్లు దాటకుండా ఉంటేనే కేసుల సంఖ్యను కట్టడి చేసేందుకు వీలుంటుందన్నారు. విధుల్లో ఉన్న ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారని.. వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఉద్యోగులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. పట్టణ వ్యాప్తంగా రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ఆటోల ద్వారా నిత్యావసర సరకులు ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రానున్న రంజాన్‌ సందర్భంగా ముస్లిం మతపెద్దలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి మసీదుల్లో పార్థనలు చేయకూడదని, ఇఫ్తార్‌ విందులు ఇవ్వకూడదని తెలిపనట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి.. పేరులోనే స్వర్ణం... పూట గడిచే పరిస్థితి లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.