ETV Bharat / city

పేరులోనే స్వర్ణం... పూట గడిచే పరిస్థితి లేదు! - ఏపీ లాక్​డౌన్ వార్తలు

కళ్లు మిరుమిట్లు గొలిపే నగలకు జీవం పోసేది వాళ్లే. అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్‌లో చేతినిండా పనే. కానీ లాక్‌డౌన్‌ వారి ఆశలకు గండికొట్టింది. ఏటా ఈ సమయంలో.. రెండు చేతులా సంపాదించే స్వర్ణకారులు.. ఇప్పుడు పూట గడవక అల్లాడుతున్నారు.

Goldsmith are facing troubles due to lock down
పేరులోనే స్వర్ణం... పూట గడిచి పరిస్థితి లేదు!
author img

By

Published : Apr 23, 2020, 6:18 AM IST

పేరులోనే స్వర్ణం... పూట గడిచి పరిస్థితి లేదు!

వేసవి వచ్చిందంటే వరుస పెళ్లిళ్లు, ఆ మధ్యలోనే అక్షయ తృతీయ.. ఇలా స్వర్ణకారులకు చేతినిండాపనే. బంగారం మార్కెట్‌లో కార్పొరేట్‌ సంస్థల ప్రవేశంతో కాస్త డిమాండ్‌ తగ్గినా.. మంచి నైపుణ్యం ఉన్న స్వర్ణకారుల ఉపాధికి ఢోకాలేదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వారి జీవితం పెనుభారంగా మారింది. మార్చి 24 నుంచి దుకాణాలు మూతపడటంతో కుటుంబాలు నడపడం కష్టంగా మారింది. తిరుపతిలో స్వర్ణకార వృత్తినే నమ్ముకున్న సుమారు 250 కుటుంబాలు ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకున్నాయి. అక్షయతృతీయ సీజన్‌లోనూ గిరాకీ లేదనిని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముందెన్నడూ ఇంత గడ్డు పరిస్థితి చూడలేదంటున్నారు. ప్రభుత్వం తమ వేదనను గుర్తించి చేయూత అందించాలని స్వర్ణకారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : 26 కోట్ల మంది ఫేస్​బుక్ డేటా చోరీ- రూ.41వేలకే సేల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.