ETV Bharat / state

సంపర్క్ క్రాంతి ఎస్​-9లో ప్రయాణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్

ఈ నెల 13న హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్​ ఎస్​-9 బోగిలో ప్రయాణించిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. 13వ తేదీ ఎస్​-9లో ప్రయాణించిన వారి వివరాలు సేకరించి గోప్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రయాణికులను నిర్బంధంలో ఉంచేలా సహకరించాలని రాష్ట్రప్రభుత్వాన్ని రైల్వే అధికారులు కోరారు.

corona positive case in ap sampar kranti train
సంపర్ క్రాంతి ఎక్స్​ప్రెస్​ ఎస్​-9 బోగిలో ప్రయాణించిన వ్యక్తికి కరోనా
author img

By

Published : Mar 19, 2020, 10:26 PM IST

సంపర్క్ క్రాంతి ఎస్​-9లో ప్రయాణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్

ఈ నెల 13వ తేదీన హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి మధ్య సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో ప్రయాణించిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తెలింది. ఆ వ్యక్తి ఈ నెల 14న రామగుండంలో దిగినట్లు రైల్వే అధికారులు నిర్ధారించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా వ్యక్తి ప్రయాణించిన ఎస్​-9 బోగిలో ప్రయాణికుల వివరాలను రైల్వేశాఖ అధికారులు సేకరించి, గోప్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఆ బోగిలో విధులు నిర్వహించిన ఇద్దరు టికెట్ కలెక్టర్​లను నిర్బంధంలో ఉంచామని, వారిలో కరోనా లక్షణాలు లేవని రేణిగుంట రైల్వే వైద్యులు తెలిపారు. 13వ తేదీ ఆ బోగిలో ప్రయాణించిన వారు 14 రోజులపాటు నిర్బంధంలో ఉండేలా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైల్వే అధికారులు కోరారు. వైరస్ వ్యాప్తి నియంత్రణపై ముందు జాగ్రత్త చర్యల్లో భాగమేనని అధికారులు తెలిపారు.

corona positive case in ap sampar kranti train
ఎస్​-9 ప్రయాణికులు వివరాలు

రైల్వేశాఖ లేఖ

ఇదీ చదవండి : భయం వద్దు... ప్రజల్లో ధైర్యం నింపండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.