ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన చిత్తూరు జిల్లా ముక్కంటి ఆలయం మూడు నెలలుగా నష్టాలు బాటలో నడుస్తోంది. కరోనా లాక్డౌన్ అమలులో ఉండటంతో ఆలయానికి భక్తుల తాకిడి మందగించింది. ఆలయానికి ప్రధాన ఆదాయ మార్గమైన రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు రోజుకు వంద కూడా రాకపోవడంతో పూర్తిస్థాయిలో ఆదాయం తగ్గింది. దర్శనాలకు సైతం వెయ్యి మంది లోబడి వస్తుండటంతో మార్చి నుంచి నేటి వరకు రూ.21 కోట్లు నష్టం వాటిల్లింది. రాష్ట్రంతోపాటు తమిళనాడు,కర్ణాటక, విదేశీ భక్తులతో నిత్యం సందడిగా ఉండే శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తులు లేక వెలవెలబోతుంది.
ఇదీచదవండి
కొవిడ్ ఆసుపత్రుల్లో నియామకాలకు ఆగస్టు ఒకటో తేదీన ఇంటర్వ్యూలు