ETV Bharat / state

పాడి రైతులపై కరోనా పిడుగు... ధర లేక దిగాలు - పాడి రైతులపై కరోనా పిడుగు

రోజుకు 30 లక్షల లీటర్ల ఉత్పత్తితో రాష్ట్రంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న చిత్తూరు జిల్లాపై కరోనా పిడుగు పడింది. లాక్‌డౌన్‌, కరోనా ప్రభావంతో వినియోగం... ఉత్పత్తి శాతాల మధ్య పెరిగిన అంతరం... పాల రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కనిష్ఠంగా 32... గరిష్ఠంగా 38 రూపాయల ధర పలికిన లీటర్‌ పాలు కరోనా ప్రభావంతో 26 రూపాయలకు పడిపోయాయి. దీంతో 6 నుంచి 12 రూపాయలు నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

పాడి రైతులపై కరోనా పిడుగు
పాడి రైతులపై కరోనా పిడుగు
author img

By

Published : Jun 29, 2020, 7:42 PM IST

పాడి రైతులను కరోనా నిలువునా ముంచుతోంది. వేసవి సీజన్‌ అని.. పాలను అధిక ధరలకు విక్రయించి ఎక్కువ లాభాలు పొందుదామని ఆశించిన అన్నదాతలపై కరోనా నీళ్లు చల్లింది. సాధారణ రోజుల కంటే తక్కువ స్థాయికి పాల ధరలు పడిపోగా.. రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నాడు. వెన్నశాతాన్ని బట్టి లీటర్‌ పాలపై ఆరు నుంచి పది రూపాయల వరకు ధర తగ్గిన పరిస్థితుల్లో.. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్న చిత్తూరు జిల్లాలో తగ్గిన పాల ధరలు పాడి రైతులను తీవ్రంగా నష్టాల పాలు చేస్తున్నాయి. ధరలు తగ్గడంతో పాటు వినియోగం తగ్గిపోవడంతో కొన్ని సంస్థలు మిల్క్‌ హాలిడే ప్రకటిస్తుండటం మరింత కలవర పెడుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడం తోనే పాడి రైతుల కష్టాలు మొదలయ్యాయి. సాధారణంగా మార్చి నెల చివరి వారం నుంచి జూలై మొదటి వారం వరకు పాడి పరిశ్రమకు అన్‌సీజన్‌గా పరిగణిస్తారు. వేసవి కావడంతో వివిధ కారణాలతో పాల ఉత్పత్తి తగ్గి ధర పెరుగుతుంది. ఈ సమయంలో రైతులు సాధారణ రోజుల కంటే ఎక్కువ లాభాలు ఆర్జిస్తారు.

ఈ ఏడాది కరోనా ప్రభావంతో ధరలు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లీటర్‌ పాలకు 3.0 శాతం కొవ్వు...8.0 శాతం వెన్న ఉన్న పాలకు కనిష్ట ధర చెల్లిస్తారు. పాడి పశువు స్థాయిని బట్టి 3.8 కొవ్వు, 8.6 నుంచి 8.8 వరకు వెన్న శాతం వస్తుంది. కొవ్వు వెన్న శాతం ఆధారంగా లీటర్‌ పాలకు 32 నుంచి 38 రూపాయల వరకు రైతులకు చెల్లిస్తారు. గరిష్టంగా కొవ్వు, వెన్న శాతం ఉన్న పాలు సైతం 26 రూపాయలకే విక్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

ఉదయం సాయంత్రం రెండు పూటలా సగటున రోజుకు పది లీటర్ల పాలు ఉత్పత్తి చేసే రైతులు ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు నష్టపోతున్నారు. పాడి పశువులకు వేసే దాణా...ఇతర గడ్డి ధరలు రవాణా స్తంభించిన కారణంగా పెరిగిపోయాయని.... అదే సమయంలో పాల ధర మాత్రం తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాణా రేటు పెరగడం... పాల రేటు తగ్గడం వంటి వాటితో తమ పశువులకు మేత, దాణా తక్కువ వేయలేము కదా అంటూ రైతులు తామెదుర్కొంటున్న కష్టాలను ఏకరవు పెడుతున్నారు.

సగటున జిల్లా వ్యాప్తంగా 30 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుండగా... కరోనా ప్రభావంతో ధరలు తగ్గి రైతులు కోట్ల రూపాయల మేర నష్టపోతున్నారు. తగ్గిన పాల ధరలతో రైతుల ఆదాయంలో కోటిన్నర నుంచి రెండు కోట్ల మేర కోత పడుతోంది. ధర తగ్గడంతో పాటు రవాణా సమస్యలతో దాణా ధరలు పెరగడం..కరోనా ప్రభావంతో వైద్యసేవలు అందక పశువులు మృత్యువాత పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.