కరోనా వైరస్ ప్రభావం ఉద్యాన పంటల మీద పడింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచలం అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో ఉద్యాన పంటలు ఎక్కువగా ఉంటాయి. అడవి జంతువులకు భయపడి ఎక్కువగా ఉద్యాన పంటలు వేస్తారు. కనకాంబరం, బంతి వంటివి ఎక్కువగా సాగు చేస్తారు. కరోనా వైరస్ కారణంగా ఉద్యాన రైతులు బలవుతున్నారు. లాక్డౌన్ ప్రకటించడంతో రైతులు విలవిలలాడుతున్నారు. పూలు కోయడానికి కూలీలు దొరకడంలేదు. ఏవో తంటాలు పడి పంట కోసినా కొనేవారు లేరు. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు