ETV Bharat / state

కరోనాతో తిరుపతి బస్టాండ్‌ వ్యాపారులు విలవిల - తిరుపతిలో కరోనా కేసులు

కరోనా వ్యాప్తితో వ్యాపారులు కుదేలయ్యారు. ఉపాధిలేక అలమటిస్తున్నారు. అద్దెలు చెల్లించలేక చేతులెత్తేస్తున్నారు. తిరుపతి బస్టాండ్ వద్ద షాపులు నిత్యం రద్దీగా ఉండేది. కరోనా విజృంభణతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ పరిణామంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు.

corona effect
corona effect
author img

By

Published : Jun 25, 2020, 9:42 AM IST

తిరుపతి సెంట్రల్‌ బస్టాండ్‌.. కరోనాకు ముందు శ్రీవారి భక్తులతో నిత్యం కళకళలాడేది. వ్యాపారాలు మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగేవి. పోటీపడి దుకాణాలు దక్కించుకునేవారు. కానీ కొవిడ్‌-19 కాటు వేయడం..లాక్‌ పడటం.. భక్తుల రాక తగ్గడం.. బస్సులు సరిగా నడవకపోవడం.. వ్యాపారం డౌన్‌ కావడం వరుసగా జరిగిపోయాయి. ఊహించని ఈ పరిణామంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. ఏడుకొండల వాడా.. ఎంతకాలం ఈ పీడ.. అంటూ శ్రీవారి ఎదుట విలపిస్తున్నారు.

రెక్కలు ఆడినా.. రొక్కం రాదని గ్రహించిన కొందరు దుకాణాలు వదిలేసేందుకు సిద్ధం అవుతున్నారు. తిరుపతి సెంట్రల్‌ బస్టాండ్‌ పరిధిలో దుకాణాలు, హోటళ్లు, మెస్‌లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు మొత్తం కలిపి 175 వరకు ఉన్నాయి.

శ్రీహరి బస్టాండ్‌లో 58, శ్రీనివాస బస్టాండ్‌లో 66, ఏడుకొండల బస్టాండ్‌లో 6, పల్లెవెలుగు బస్టాండ్‌లో 5, ఆర్‌ఎం కార్యాలయం కాంప్లెక్స్‌లో 29 దుకాణాలు ఉన్నాయి. దుకాణాల వ్యాపారంతో నెలకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం పట్టుమని రూ.10 లక్షల వ్యాపారం కూడా సాగడం లేదు.

ఈ పరిస్థితుల్లో దుకాణాలు నడపడం సాధ్యం కాదని వ్యాపారులు గ్రహించారు. వేలకు వేలు అద్దెలు చెల్లించలేమని, దుకాణాలు వద్దని ఆర్టీసీ అధికారులకు పత్రాలు రాసి ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం దుకాణం వద్దనుకునేవారు మూడు నెలల ముందు పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది.

ఇప్పటికే సుమారు 30 మంది వరకు రాసి ఇచ్చారు. కొత్తగా తీసుకున్న దుకాణదారులు ఏడాది పాటు తప్పనిసరిగా వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో వారికి ఇది తప్పడం లేదు. లాక్‌డౌన్‌ సమయం ఏప్రిల్‌, మే నెలల్లో తమకు అద్దెల నుంచి మినహాయింపు ఇవ్వాలని పలువురు వ్యాపారులు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు

ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండ్‌లోని దుకాణాలకు సంబంధించి లాక్‌డౌన్‌ సమయంలో అద్దెల మినహాయింపు విషయం ఉన్నతాధికారులకు తెలుపుతాం. వారి నిర్ణయం మేరకు నడుచుకుంటాం. కొంతమంది దుకాణాలు వద్దని పత్రాలు రాసి ఇస్తున్నారు. పరిస్థితులు మెరుగు పరిచేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. - విశ్వనాథం, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌

ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.