చిత్తూరు జిల్లాలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా శ్రీకాళహస్తిలో 43 పాజిటివ్ కేసులు రాగా.. తిరుపతి నగరంలో 8, నగరిలో 4, పలమనేరు, ఎర్రావారిపాలెంలో 3, నిండ్ర, ఏర్పేడు, రేణిగుంటలలో 2, బీఎన్ కండ్రిగ, వరదయ్యపాలెం, పుత్తూరు, వడమాలపేట, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరిలలో ఒక్కో కేసు నమోదైంది. వీరిలో ఇప్పటివరకూ 13 మంది డిశ్చార్జ్ కాగా.. జిల్లాలో యాక్టివ్ కేసులు సంఖ్య 60కి తగ్గింది. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించిన అధికారులు.. అక్కడ పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ప్రజలెవరూ రాష్ట్రంలోకి రాకుండా సత్యవేడు, నగరి, పలమనేరు, కుప్పం, మదనపల్లె నియోజకవర్గాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉండడం వల్ల పూర్తిస్థాయిలో మాంసం దుకాణాలు మూసివేశారు. కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తిస్తూ వారిని క్వారంటైన్లకు తరలిస్తున్నారు.
ఇదీ చూడండి..