చిత్తూరు జిల్లాలోని రామసముద్రం మండలం బిక్కింవారిపల్లిలో శివప్ప, అంజప్ప అనే రైతుల మధ్య కూలీల విషయమై వివాదం నెలకొంది. ఈ ఘర్షణలో మాటా మాటా పెరిగి... నాటు కొడవలి, నాటు తుపాకీతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శివప్ప, అంజప్పలను అదుపులోకి తీసుకుని.. కొడవలి, నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: