ఎమ్మెల్యే నవాజ్ బాషాపై ఎస్ఈసీకి మదనపల్లె, అంకిశెట్టి పల్లి వాసులు ఫిర్యాదు చేశారు. తిరుమల పద్మావతి అతిధి గృహంలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను అంకిశెట్టి పల్లి పంచాయతీ సర్పంచిగా పోటీ చేసిన వెంకటరమణ.. గ్రామస్థులతోపాటుగా వెళ్లి కలిశారు.
కౌంటింగ్ సమయంలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. తాను గెలిచినప్పటికీ... ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రమేయంతో.. తన ప్రత్యర్థి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారని ఆయన ఆరోపించారు. బెదిరింపులకు సంబంధించిన వీడియోలను ఎస్ఈసీకి సమర్పించారు. తమకు న్యాయం చేయాలని ఎస్ఈసీకి కోరారు.
ఇదీ చదవండి: