ETV Bharat / state

'కోవిడ్ బాధితుల కోసం.. రైల్వే బోగీలు వినియోగిస్తాం' - చిత్తూరు వైద్యం: కియోస్క్‌ ద్వారా నమూనాల సేకరణ

తిరుపతిలో కోవిడ్ బాధితుల కోసం రైల్వే బోగిలు సైతం ఉపయోగించుకుంటామని జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు. ఈ మేరకు రైల్వే స్టేషన్‌ను సందర్శించి.. బోగీల్లో రూపొందించిన 60 ఐసోలేషన్‌ వార్డులను పరిశీలించారు.

chittor district
రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్‌ భరత్‌గుప్తా
author img

By

Published : Apr 15, 2020, 2:38 PM IST

చిత్తురు జిల్లాలో కొవిడ్‌-19 చికిత్సకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పటికే ప్రత్యేకంగా ఆస్పత్రుల్లో వసతులు కల్పించడంతో పాటు రైలు బోగీలను సైతం వాడుకుంటామని జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను సందర్శించి.. బోగీల్లో తయారు చేసిన 60 ఐసోలేషన్‌ వార్డులను పరిశీలించారు. వివరాలను స్టేషన్‌ డైరెక్టర్‌ నాగరమణశర్మను అడిగి తెలుసుకున్నారు. బోగీల్లోని క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వార్డులను అత్యవసర పరిస్థితుల్లో ఉయోగిస్తామని కలెక్టర్‌ చెప్పారు. నాగరమణశర్మ మాట్లాడుతూ ప్రతి బోగీలో 9 మందికి చికిత్స అందించవచ్చని, నర్సులు, వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా వేరే బోగీల్లో వసతి ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌కు వివరించారు.

నమూనాల సేకరణ 100 శాతం

క్వారంటైన్‌లో ఉన్నవారి నుంచి నమూనాల సేకరణను 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ భరత్‌గుప్తా ఆదేశించారు. మంగళవారం చిత్తూరు నుంచి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ.. నమూనాలసేకరణ వేగవంతం చేయాలని, పాజిటివ్‌ కేసులు వచ్చినవారితో కాంటాక్టు అయిన వారి ఆరోగ్య స్థితిపై వైద్యాధికారులు దృష్టి సారించాలని సూచించారు. కంటైన్మెంట్‌ జోన్లు, హాట్‌స్పాట్‌లలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తోన్న వైద్యసిబ్బందికి ప్రజలు సహకరించేలా చైతన్యం తీసుకురావాలని కలెక్టర్‌ కోరారు.

మూడు జోన్లపై సిద్ధంగా ఉన్నాం

లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో జిల్లాలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లపై కార్యాచరణ ప్రణాళికను ఈ నెల 20లోపు సిద్ధం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. బయటి ప్రాంతాలవారు జిల్లాలోకి ప్రవేశించకుండా పటిష్ఠ చర్యలు చేపట్టామని, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు సమూహంగా చేరకుండా పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. జడ్పీ సీఈవో కోదండరామిరెడ్డి, డాక్టర్‌ రమాదేవి పాల్గొన్నారు.

ఇక్కడ భద్రంగా ఉండండి

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: శ్రీకాళహస్తి పట్టణంతో పాటు వడమాలపేట గ్రామంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈనెల 10 నుంచి 13 వరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను వివరిస్తూ తన అధికారిక ట్విటర్‌లో ఓ పోస్టును ఉరచి ఈ హెచ్చరిక జారీ చేసింది. భౌతిక దూరం పాటించడంతో పాటు ఇళ్లలో నుంచి బయటికి రావద్దని విజ్ఞప్తి చేసింది.

వామ్మో... ఎంత మంది?

కరోనా అనుమానితుల సంఖ్య మంగళవారం అనూహ్యంగా పెరిగిపోయింది. సోమవారం క్వారంటైన్లలో ఉన్న వీరి సంఖ్య 1,138 నుంచి మంగళవారానికి 1,467కు చేరింది. క్వారంటైన్లు తెరిచిన తర్వాత ఒకరోజు వ్యవధిలోనే 329 మంది చేరడం ఇదే తొలిసారి. మొదటి, రెండో కాంటాక్టులంతా ఐసోలేషన్‌, క్వారంటైన్లలో ఉన్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించగా.. మళ్లీ కొత్త వారికి వైరస్‌ ఎలా సంక్రమించిందన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ... ఇంటింటి సర్వేలో భాగంగా జలుబు, దగ్గు ఉన్నవారిని కూడా క్వారంటైన్లలో ఉంచామని, వీరిని రెండు రోజుల పాటు పరిశీలించిన తర్వాత నమూనాలు సేకరించి పరీక్షిస్తామంటున్నారు. పరీక్షల కోసం వేచి ఉన్న నమూనాల సంఖ్య కూడా 221 నుంచి 499 పెరిగిపోయింది. ఇతర జిల్లాల నమూనాలు పరీక్షిస్తున్న కారణంగా మన జిల్లా తాలూకు నమూనాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

చిత్తూరు వైద్యం: కియోస్క్‌ ద్వారా నమూనాల సేకరణ

ఇక చిత్తూరులోని జిల్లా కొవిడ్‌ ఆస్పత్రిలో మంగళవారం కియోస్క్‌ ద్వారా గళ్ల నమూనాల సేకరణను వైద్యాధికారులు ప్రారంభించారు. వైద్యుల రక్షణ కోసం కియోస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. తొలిరోజు 19మంది అనుమానితుల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం తిరుపతికి పంపారు. జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి నోడల్‌ అధికారి జయరాజన్‌, అపోలో అధికారి నరేష్‌రెడ్డి, వైద్యులు పురుషోత్తం పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:

లాక్ డౌన్ ఎఫెక్ట్​: శ్రీవారి దర్శనం నిలిపివేత పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.