ETV Bharat / state

కౌలు రైతును నిండా ముంచిన మిగ్‌జాం తుపాను-ఉదారమంటూ ఉత్తమాటలు వల్లెవేస్తున్న సీఎం జగన్‌

CM Jagan Cheating Tenant Farmers : చెప్పే మాటకు చేతకు పొంతన ఉండదు! ఇచ్చే హామీ అమలుకు నోచదు! వెంటనే చేసేద్దామని చెప్పారంటే ఇక అంతే సంగతులు! ఉదారమన్నారంటే ఇక అంతే సంగతులు! ఇదీ జగనన్న సర్కారు మార్కు! రాష్ట్రంలో కౌలురైతుల దుస్థితే దీనికి తార్కాణం. వారి కష్టాన్ని మిగ్‌జాం తుపాను తుడిచేసినా ప్రభుత్వానికి పట్టని తీరే ఇందుకు నిదర్శనం.

CM_Jagan_Cheating_Tenant_Farmers
CM_Jagan_Cheating_Tenant_Farmers
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 7:45 AM IST

కౌలు రైతును నిండా ముంచిన మిగ్‌జాం తుపాను-ఉదారమంటూ ఉత్తమాటలు వల్లెవేస్తున్న సీఎం జగన్‌

CM Jagan Cheating Tenant Farmers : కౌలు రైతు వెన్ను విరిగినా ముఖ్యమంత్రి జగన్‌ భరోసా ఇవ్వలేదు. మిగ్‌జాం తుపాను (Michaung Cyclone) నిండా ముంచినా కనికరం చూపలేదు. ఈ విపత్తు వల్ల దెబ్బతిన్న రైతుల్లో అధికశాతం కౌలురైతులే. గింజ రాక మొక్క బతక్కపెట్టుబడి పూర్తిగా పోయింది. డ్రెయిన్లు, కాలువలకు మరమ్మతులు కూడా చేయని పాపం ఫలితమే రైతుపాలిట శాపమైంది.

Tenant Farmers Crop Loss With Michaung Cyclone : ‘ధాన్యం ఇక చేతికొచ్చేసినట్లే, కోసిన నాలుగు రోజుల్లో సొమ్ము అందుతుంది. అప్పులు తీరతాయి. పిల్లల చదువులకూ ఇబ్బంది ఉండదు’అనే సంతోషంలో ఉన్న అన్నదాతలపై మిగ్‌జాం తుపాను విరుచుకుపడింది. కూలీ చేసుకుంటూనే అప్పు తెచ్చి, పెట్టుబడి పెట్టి సాగు చేసిన కౌలు రైతుల కలల్ని తుంచేసింది. ఒక్కో కౌలు రైతు ఎకరాకు 35 వేల నుంచి 40 వేల రూపాయల పెట్టుబడితో వరి వేస్తే అది కాస్తా వర్షార్పణమైంది. చాలాచోట్ల గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఇంతటి ఆపత్కాలంలోనూ కోతల అనంతర నష్టానికి పెట్టుబడి సాయం ఇవ్వలేమంటూ సర్కారు మొండిచేయి చూపిస్తోంది. మిరప రైతులైతే కోలుకోలేని విధంగా కుంగిపోయారు. ఉదారంగా ఆదుకోవాలని సమీక్ష సమావేశాల్లో అస్తమానం వల్లె వేసే ముఖ్యమంత్రి జగన్‌కు వారి గోడు పట్టడం లేదు. సర్వస్వమూ కోల్పోయిన కౌలుదారులకు భరోసా ఇవ్వాలనే ఆలోచనే కొరవడింది. కౌలు రైతుల కోసం ఇదిగో ఈ చర్యలు తీసుకోండనే ఉత్తర్వులిచ్చిన దాఖలాలే లేవు.

తుపాను ప్రభావంతో నిండామునిగిన మినుము రైతులు- పట్టించుకోని ప్రభుత్వం, ఆర్బీకే అధికారులు

AP Farmers Problems with Cyclones : మిగ్‌జాం కారణంగా ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల 78 వేల ఎకరాల్లో వరి పైరుకు నష్టం వాటిల్లింది. పనల మీదున్న, తడిసిన ధాన్యం కూడా కలిపితే మరో 10 లక్షల ఎకరాల వరకు పంటను రైతులు నష్టపోయి ఉంటారని అనధికారిక అంచనా. ఈ బాధితుల్లో 70 శాతం వరకు కౌలు రైతులే ఉంటారు. తీవ్ర తుపాను తర్వాత ఇప్పటి వరకు ఐదుగురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నష్టపోయిన వరి, నేలవాలిన అరటి, కుళ్లిపోతున్న మినుము, పసుపు తదితర దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఏ కౌలు రైతును కదిలించినా కన్నీరుబుకుతోంది.

Michaung Cyclone in AP : కృష్ణా డెల్టాలో మొన్నటి వరకు సాగు నీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. పొలాలను కాపాడుకోవడానికి డీజిల్‌ ఇంజిన్లను వాడాల్సి వచ్చింది. ఖరీఫ్‌లో నాట్లు వేసింది మొదలు రైతులు ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరి భూములకు నీరందలేదు. కాలువల్లో అరకొరగా పారుతున్న నీటిని డీజిల్‌ ఇంజిన్ల ద్వారా తోడుతూ పంటలకు సరఫరా చేశారు. ఎంతో శ్రమించి వరి పండిస్తే అది కాస్తా తీవ్ర తుపాను పాలైంది. మిగ్‌జాం కారణంగా పొలాల్లో చేరిన నీటిని మళ్లీ డీజిల్‌ ఇంజిన్లతోనే తోడిపోయాల్సి వచ్చింది. ఎంత తోడినా నీరు ముందుకు కదల లేదు. డ్రైనేజీ, కాలువల వ్యవస్థ సరిగా ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. వాన కురిసిన తర్వాత ఒక్క రోజులోనే నీరు బయటకు వెళ్లిపోతే ఇంత నష్టం వచ్చేది కాదు. పసుపు, మిరప, మినుము, అరటి తదితర పంటలు వేసిన రైతులదీ ఇదే పరిస్థితి.

Farmers Situation in Michaung Cyclone : పడిపోయిన వరిని కోయిస్తే ఖర్చులు తడిసి మోపెడవుతాయి. సాధారణంగా ఎకరా పైరును కోయించాలంటే 4 వేల రూపాయలు అవుతుంది. అదే పడిపోయిన వరిని కోయించాలంటే 10 వేల పైనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయినా దిగుబడి దెబ్బతింటుంది. ఎకరాకు 15 బస్తాలు వస్తే ఘనమే. దానికీ సరైన ధర లభించదు. ఎకరాకు 10 వేలకు పైగా ఖర్చు పెట్టినా అమ్మితే ఆ సొమ్మైనా వస్తుందనే నమ్మకం లేదు. దీనికి మళ్లీ అప్పు చేయాల్సిందే. అందుకే రైతులు వరిని కోయించడం కంటే తొక్కించేయడమే నయమని భావిస్తున్నారు. చాలాచోట్ల దమ్ము చేయించి మరో పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు. మెట్ట పంటలు వేసిన కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.

మిగ్​జాం తుపానుతో వేల ఎకరాల్లో కూరగాయల పంటలకు తెగుళ్లు- ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అన్నదాతల వేడుకోలు

Cyclones in YSRCP Government : తీవ్ర తుపాను సృష్టించిన బీభత్సంతో కౌలు రైతులకు తీరని వేదనే మిగిలింది. రాధాకృష్ణ కమిషన్‌ ప్రకారం రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో అధిక శాతం నిరుపేదలే. కూలీ పనులు చేసుకుంటూ పోగు చేసుకుంటున్న మొత్తంతోపాటు మరికొంత అప్పు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. అయినా వారికి కౌలు కార్డులు అందక గుర్తింపు దక్కడం లేదు. ఈ-క్రాప్, ఈకేవైసీ సహా ప్రభుత్వం కల్పించే రైతుభరోసా, సున్నా వడ్డీ, పంటల బీమా వంటి ప్రయోజనాలకూ నోచుకోలేకున్నారు. కనీసం రాయితీ విత్తనాలు కూడా దక్కని దుస్థితి.

YSRCP Government Careless on Tenant Farmers : సగటున ఒక్కో రైతు మూడు నుంచి నాలుగెకరాలను కౌలుకు సాగు చేస్తున్నారు. ఎకరాకు 30 వేల నుంచి 40 వేల రూపాయల వరకు పెట్టుబడి కావాలి. మొత్తంగా లక్షకు పైగానే ఖర్చు పెడుతున్నారు. వర్షాలు, కరవు, వరదల కారణంగా పంట చేతికి రాకపోవడంతో చివరికి అప్పులే మిగులుతున్నాయి. పంట పండినా, పోయినా యజమానికి మాత్రం కౌలు చెల్లించాల్సిందే. ప్రకృతి విపత్తుల కారణంగా సాగులో మిగులు లేకపోగా అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. వాటిని తీర్చలేక, వయసు మళ్లిన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోలేక, పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లల వివాహాలు జరిపించలేక మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

రైతులను పరామర్శించాలంటే పొలాల్లోకే వెళ్లాలా ఏంటీ? - వేదిక పైనుంచి జగన్ ముసిముసి నవ్వులతో పలకరింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.