ETV Bharat / state

'విపక్షాల అభ్యంతరాలపై ఎన్నికల సంఘం నిర్లక్ష్యం' - results

మంగళవారం దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.... నిన్న అర్ధరాత్రి బెంగళూరుకి చేరుకుని దేవగౌడతో సమాలోచనలు జరిపారు. ఎన్నికల ఫలితాలు, ఈసీ తీరు వంటి అంశాలపై గంటకు పైగా చర్చించారు.

దేవగౌడతో చంద్రబాబు భేటీ
author img

By

Published : May 22, 2019, 4:35 AM IST

దేవగౌడతో బాబు భేటీ

ఈవీఎం, వీవీ ప్యాట్లలో చోటు చేసుకున్న అక్రమాలపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఏ మాత్రం ఫలితం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. బెంగళూరులోని పద్మనాభనగర్​లో మాజీ ప్రధాని దేవగౌడతో మంగళవారం అర్థరాత్రి ఆయన భేటీ అయ్యారు. దిల్లీ నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబు జాతీయ రాజకీయాలు, ఎన్నికల ఫలితాల అనంతరం కార్యాచరణపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో ముచ్చటించిన నేతలు కేంద్రం తీరుని తప్పుబట్టారు. 22 పార్టీల నేతలు కలిసి ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన లేదని చంద్రబాబు ఆరోపించారు. ఈవీఎంలలో సమస్య తలెత్తినప్పుడు నియోజకవర్గంలోని అన్ని వీవీ ప్యాట్​లను లెక్కించాలనేదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్​లో ఈవీఎంలు హోటళ్లు, ఇళ్లలో భద్రపరుస్తున్నారని.. ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్నారని ఈ చర్యలు అనుమానాలను రేకెత్తిస్తున్నాని అన్నారు. వివిధ అంశాలపై కేంద్రం నిర్లక్ష్యం వహించడం నియంతృత్వ ధోరణిని తలపిస్తోందని దేవగౌడ విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రత్యేక ప్రణాళికలతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తెదేపా సీనియర్ నేత కంభంపాటి రామ మోహన్​రావు పాల్గొన్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.