ETV Bharat / state

'కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాం'

జిల్లాలో కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్​ భరత్​ గుప్తా తెలిపారు. శ్రీకాళహస్తిలో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఆయన.. అక్కడ పర్యటించి పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. పట్టణంలో మళ్లీ రీసర్వే చేస్తామని.. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

author img

By

Published : Mar 25, 2020, 4:49 AM IST

'కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాం'
'కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాం'
కరోనా నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్న కలెక్టర్​

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ యువకునికి కరోనా పాజిటివ్ రావటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్​ భరత్​ నారాయణ్​ గుప్తా శ్రీకాళహస్తిని సందర్శించి.. నియోజకవర్గంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచించారు. కరోనా సోకిన వ్యక్తి నివాసం నుంచి 3 కిలోమీటర్ల మేర స్ప్రేయింగ్​ చేయించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్​ తెలిపారు. 20 వేల పట్టణ జనాభాను సర్వే చేయిస్తామన్న ఆయన.. దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు తిరగరాదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

చిత్తూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.