చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 7.05 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశామని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ తెలిపారు. జిల్లాలో మొదటి, రెండు డోసుల కింద మొత్తం 7.05 లక్షల డోసులు వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. ఇందులో మొదటి డోసు కింద 5.23 లక్షలు, రెండవ డోసు కింద 1.82 లక్షల డోసులు వేశామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 31 వరకు పూర్తిగా రెండవ డోసు వ్యాక్సినేషన్ చేయవలసి ఉందని తెలిపారు. జిల్లాలో 45 సంవత్సరాలు వయసు పూర్తైన దాదాపు 1.22 లక్షల మందికి రెండవ డోసు వ్యాక్సినేషన్ చేయాల్సి ఉందన్నారు.
జిల్లాలో ప్రస్తుతం 24 వేల డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రెండో డోస్ వ్యాక్సినేషన్ వేయించుకోవలసిన వారికి వార్డు/ గ్రామ సచివాలయ సిబ్బంది, ఆశాలు, ఏఎన్ఎం లు, వాలంటీర్ల ద్వారా వారి ఇంటి వద్దే టోకెన్లను అందజేస్తామని చెప్పారు. జిల్లాలో కరోనా బాధితుల వైద్య చికిత్సకోసం వైద్యులు, సిబ్బంది కొరత లేదని చెప్పారు. జిల్లాలో అవసరం మేరకు ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని.. అదనంగా 4 నుంచి 5 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: