కిసాన్ సువిధ రైతు సంఘంలో 6వేల మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారని....తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంఘానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిందని...అందుచేతనే తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం నిర్వహించానని అబ్దుల్ అలీ తెలిపారు. నిన్న రాత్రి వేళ కిసాన్ సౌదా ఫ్యాక్టరీ ప్రహారీ గోడలు, గేట్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని... అధికార పార్టీ వారే ఇలా చేసారని అలీ ఆరోపించారు. విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని సంఘటనా స్థలానికి చేరుకుని అబ్దుల్ అలీకి మద్దతునిచ్చారు. ఇది కేవలం కిసాన్ సువిధపై దాడి చేసినట్లు కాదని... 6వేల మంది రైతులపై దాడి చేసినట్లేనని నాని మండిపడ్డారు. దీనిపై న్యాయం జరగనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇవి చూడండి: మహా విషాదం: వర్షాలకు 30 మంది బలి