ETV Bharat / state

Chittoor: బోడేవాండ్లపల్లి సమీపంలో బైకును ఢీ కొట్టిన ట్రాక్టర్​.. ఇద్దరికి గాయాలు

చిత్తూరు జిల్లా బోడేవాండ్లపల్లిలో ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్​ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

Accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jul 14, 2021, 1:37 PM IST

చిత్తూరు జిల్లా, యర్రావారిపాళ్యం మండలం, బోడేవాండ్లపల్లి సమీపంలో బైకును ట్రాక్టర్ ఢీకొని ఆగకుండా వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే పోలీసులు సంఘటన స్థలంలో దొరికిన పెన్ను క్యాప్ ఆధారంగా కేసును గంటలో చేధించారు.

కరపర్తివారిపల్లె పంచాయితీ ఆవులవారిపల్లెకు చెందిన గురవయ్య దామలచెరువులో ట్రాక్టర్లలో మామిడికాయలు దించి తిరుగు పయనమయ్యాడు. నెరబైలు గ్రామం పులిబోనుపల్లి సమీపంలోకి చేరుకోగానే చింతగుంట గ్రామం సిద్దలవాండ్లపల్లికి చెందిన కంచన ఈశ్వరయ్య, రెడ్డెప్పలు బోడేవాండ్లపల్లి నుంచి బైక్​పై ఎదురుగా వస్తుండగా ట్రాక్టర్ ఢీ కొట్టింది.

ఈ సంఘటనలో ఈశ్వరయ్యకు తీవ్రగాయాలు కాగా, రెడ్డెప్ప స్వల్పగాలతో బయటపడ్డాడు. కేసు తనమీదకు వస్తుందని భావించిన ట్రాక్టర్ డ్రైవర్ గురవయ్య వాహనంతో సహా పరారయ్యాడు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాక్టర్ ను గుర్తించి విచారణ చేపట్టారు.

ప్రమాదంలో గాయపడ్డ ఈశ్వరయ్య పెన్ క్యాప్ ట్రాక్టర్ ట్రాలీకి తగులుకొని ఉండటాన్ని గుర్తించిన పోలీసులు ట్రాక్టర్ స్వాధీనం చేసుకుని, గురవయ్యను అదుపులోకి తీసుకొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటమోహన్ తెలిపారు.

ఇదీ చదవండి:

RED SANDAL: రూ.6.03 కోట్లు విలువైన ఎర్ర చందనం పట్టివేత.. స్మగ్లర్ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.